మార్కాపురం జిల్లా కంభం సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శనివారం స్థానిక ఎస్సై శివ కృష్ణారెడ్డి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించేలా చూడాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు.