యధావిధిగా రాకపోకలు

మార్కాపురం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం వద్ద రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో, నెలరోజులుగా నిలిచిపోయిన వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగించవచ్చని అధికారులు సూచించారు. గతంలో గిద్దలూరు, కలసపాడు మీదుగా పోరుమామిళ్ల వైపు వెళ్లే వాహనాలు, అలాగే కొమరోలు మీదుగా కడప వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తవడంతో అన్ని రకాల వాహనాలు యధావిధిగా రాకపోకలు సాగించవచ్చు.

సంబంధిత పోస్ట్