ఎల్ఈడి లైట్లు ధ్వంసం చేసిన సీఐ మల్లికార్జున

మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో, అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సీఐ మల్లికార్జున వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో అమర్చిన ఎల్ఈడీ లైట్లను ఆయన ధ్వంసం చేశారు. కంపెనీ అందించిన లైట్లకు బదులుగా వాహనదారులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఎల్ఈడీ లైట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఈడీ లైట్లు అమర్చరాదని వాహనదారులను ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్