కొమరోలు మండలంలోని తాటిచర్లమోటు సబ్ స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. మరమ్మత్తుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తాటిచర్ల, నాగిరెడ్డిపల్లి, హసనాపురం, ముత్రాసుపల్లి, దద్దవాడ, గుండ్రెడ్డి పల్లె, నారాయణపల్లి, అలసందలపల్లె, గోవిందపల్లె, పొట్టిపల్లె, అక్కపల్లె, వెంకటంపల్లె, కంకరవాని పల్లె గ్రామాలలో నిలిచిపోతుందన్నారు.