మార్కాపురం జిల్లా అర్థవీడులో ఓ ఎరువుల దుకాణంలో ఒంగోలు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్ ను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఈపాస్ మెషిన్ నందు స్టాకు వ్యత్యాసం ఉన్నందున రూ. 4,31,108 విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.