ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో వాహనదారులకు ఆర్టీవో అధికారులు జలక్ ఇచ్చారు. గురువారం అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు భారీ జరిమానాలు విధించారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు ఆర్టీవో మాధవరావు వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించని వాహనదారులకు రూ. 39 వేలు జరిమానా విధించినట్లు ఆర్టీవో తెలిపారు.