బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత

మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలకు 340 మంది సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్కువ మంది సిబ్బందిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల కోసం 5 మంది సీఐలు, 14 మంది ఎస్సైలు, 320 మంది సిబ్బందిని కేటాయించారు. ఎస్పీ మంగళవారం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్