జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. చీమకుర్తి నుండి తాడిపత్రికి గ్రానైట్ బండరాయితో వెళ్తున్న లారీ ట్రాక్ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో నంద్యాల-గిద్దలూరు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న నంద్యాల, గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు గంటలకు పైగా పోలీసులు శ్రమించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్