గిద్దలూరులోని సబ్ జైల్‌ను జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ యస్. కె. ఇబ్రహీం షరీఫ్, గిద్దలూరు న్యాయమూర్తులు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె. భరత్ చంద్ర, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్ సందర్శించారు. జైలులో ఉన్న ఖైదీల బాగోగులు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన సహాయం అందేలా జైలర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఖైదీలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ యూ. లింగారెడ్డి, లీగల్ ఎయిడ్ న్యాయవాది కె. రవి ప్రకాష్ బాబు, పారా లీగల్ వాలంటీర్ అద్దంకి. మధుసూధనరావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.