శ్రీశైలంకి బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే

మార్కాపురం జిల్లా గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం ప్రారంభించారు. గతంలో ప్రయాణికుల ఆదరణ లేక రద్దు చేసిన ఈ సర్వీసులను, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు అధికారులు పునఃప్రారంభించారు. బస్సు సర్వీసులు పునఃప్రారంభించడంపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బస్సును నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్