మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు. ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.