మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో డిసెంబర్ 30వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు నేపథ్యంలో దద్దవాడ, నాగిరెడ్డిపల్లి, అలసందలపల్లి, నారాయణ పల్లి, గుండ్రెడ్డిపల్లి, వెంకటం పల్లి గ్రామాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.