గిద్దలూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డి.ఈ.ఈ శేషగిరిరావు తెలిపారు. మరమ్మతుల కారణంగా బురుజుపల్లె, కృష్ణం శెట్టిపల్లి, కంచిపల్లె గ్రామాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్