రేపు కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతులు, నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓబులాపురం, మలికపల్లి గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్