పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎస్పీ

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూ. 1.30 కోట్లతో ఇండియన్ ఆయిల్ సంస్థ నిర్మించనున్న నూతన పెట్రోల్ బంక్ నిర్మాణ పనులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ బంక్ నాలుగు నెలల్లో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, నాణ్యమైన డీజిల్, పెట్రోల్ అందించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్