వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీఐ

ప్రకాశం జిల్లా వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ను శుక్రవారం సీఐ భీమా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించి ఎస్ఐ కృష్ణ పావనికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు అరికట్టే అంశంపై విశ్లేషించడంతోపాటు పోలీసు సిబ్బందిని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగతనాలు అరికట్టే అంశాన్ని ప్రజలకు వివరించాలని సిఐ భీమా నాయక్ ఎస్ఐకి సూచించారు.

సంబంధిత పోస్ట్