మార్కాపురం జిల్లా కనిగిరి పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న జనగణన గృహ జాబితా కార్యక్రమం దాదాపు పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ నెల 30వ తేదీని గడువుగా నిర్ణయించినట్లు మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ తెలిపారు. ఇంకా ఎవరిదైనా ఇంటి వివరాలు నమోదు కాకపోతే, పౌరులు కనిగిరి పురపాలక సంఘం కార్యాలయాన్ని సంప్రదించి తమ గృహ గణనను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.