గుంటూరు నుంచి కనిగిరికి ప్యాసింజర్ రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలు 169 కిలోమీటర్లు ప్రయాణిస్తూ, మార్గమధ్యంలో 17చోట్ల ఆగుతూ మొత్తం 19 స్టేషన్ల మీదుగా వెళ్తుంది. గుంటూరు జంక్షన్లో ఉదయం 7:00 గంటలకు బయలుదేరి, నరసరావుపేట, వినుకొండ మీదుగా ఉదయం 9:23 గంటలకు దర్శి చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 10:25 గంటలకు కనిగిరి చేరుకుంటుంది. ఈ రైలు వారానికి 6 సర్వీసులు నడుస్తుంది.