కనిగిరిలో మౌలిక వసతుల కల్పనకు కృషి: కమిషనర్

మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన డ్రైనేజీ కాలువలను మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, టిడిపి నాయకులు శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు జంషీర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్