శనివారం మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని అన్న క్యాంటీన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సందర్శించారు. క్యాంటీన్లో అందజేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను ఆయన పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలను అడిగి నాణ్యత గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, భోజనాన్ని నాణ్యతతో తయారు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, తహశీల్దార్ ఆయన వెంట ఉన్నారు.