తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు శంఖవరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో వచ్చే చెత్తను సైడ్ కాలువల్లో వేయొద్దన్నారు. ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందజేయాలన్నారు.