మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో, దానిని సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ సూచించారు. కనిగిరి కోర్టు ఆవరణలో సోమవారం పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులు ఈ మార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.