ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో గురువారం స్థానిక పోలీసులు డ్రోన్ సహాయంతో ప్రత్యేకంగా భద్రతను పర్యవేక్షించారు. నిర్మానుష ప్రదేశాలు అనుమానిత వ్యక్తుల కదలికలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పామూరు పోలీసులు తెలిపారు. గంజాయి, పేకాట, కోడి పందాలు అరికట్టేందుకు డ్రోన్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.