అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే ప్రయత్నాలలో భాగంగా వెలిగండ్ల పోలీసులు సోమవారం డ్రోన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. నిర్మానుష ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉండే ప్రాంతాలను పోలీసులు డ్రోన్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో నేరాల నియంత్రణ కొరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు వెలిగండ్ల ఎస్సై కృష్ణ పావని తెలిపారు.