పామూరు సీఐగా వినోద్ కుమార్

మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరులో బుధవారం నూతన సీఐ వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉన్న సీఐ శ్రీనివాసరావును ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీఆర్ కు పంపారు. తన సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే విధంగా సమర్థవంతంగా పనిచేస్తానని నూతన సీఐ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నియామకం స్థానికంగా శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్