ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి ఒంగోలుకు వెళ్లే ప్రయాణికులు బస్సు సర్వీసుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి బస్సులు లేకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు బస్టాండ్‌లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉన్నా, అందుకు తగినన్ని బస్సులు నడపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్సు సర్వీసులను పెంచాలని వారు కోరుతున్నారు.