దెబ్బతిన్న రోడ్డుతో వాహరదారుల అవస్థలు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలోని ట్రంక్ రోడ్డు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం, దెబ్బతిన్న రోడ్డు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి స్వామి ఇలాఖలోనే రోడ్ల దుస్థితిపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గుంతలలో నీరు నిలిచి, వాటి లోతు అంచనా వేయడం కష్టంగా మారిందని, దీంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్