ప్రకాశం జిల్లా టంగుటూరులోని అరుంధతి నగర్ లో రహదారులు అద్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యవసరాల కోసం వచ్చే వాహనాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడానికి కష్టమవుతోందని వారు తెలిపారు.