కొండపిలో నేడు విద్యుత్ సరఫరా కు అంతరాయం

ప్రకాశం జిల్లా కొండపి మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఇలవర పీడర్ పరిధిలో జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్