విద్యుత్ సమస్యపై నిరసన

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో బుధవారం దామచర్ల ఆంజనేయులు కాలనీవాసులు విద్యుత్ అధికారులతో కరెంట్ ఆఫీస్ వద్ద వాగ్వాదానికి దిగారు. కాలం చెల్లిన కరెంటు వైర్లతో ఇబ్బందులు పడుతున్నామని, ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ టీవీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్లు కాలిపోతున్నాయని, ఒక విద్యుత్ స్తంభం ఒరిగి చాలా రోజులు గడుస్తున్నా మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్