ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గురువారం ఎస్సై మహేంద్రా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని క్రమశిక్షణతో మెలగాలని వారికి ఎస్ఐ తెలిపారు. ఎవరైనా తమ పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన లేదా మిమ్మల్ని తాకేందుకు ప్రయత్నించిన వెంటనే మీ తల్లిదండ్రులకు లేదా మీ ఉపాధ్యాయులకు చెప్పాలని ఎస్ఐ అన్నారు.