తర్లుపాడు మండలం మీర్జాపేటలో శుక్రవారం రెవిన్యూ గ్రామసభను MRO కిషోర్ కుమార్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సభ జరిగింది. భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు తెలియజేస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.