కొండపి ఎస్ఐగా త్యాగరాజు

ప్రకాశం జిల్లా కొండపిలో నూతన ఎస్సైగా త్యాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో దొనకొండ ఎస్సైగా పనిచేసిన ఆయన బదిలీపై కొండపికి వచ్చారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా తన వంతు బాధ్యత నిర్వహిస్తానని నూతన ఎస్సై త్యాగరాజు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి, పరిచయం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్