డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు

మార్కాపురం జిల్లాలో జనాభా లెక్కల సేకరణ డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. మొదటి విడతలో ఇండ్ల గణన, రెండో విడతలో జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తెచ్చామని, జిల్లాలోని 497 గ్రామాలలో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్