మార్కాపురం కలెక్టరేట్లో జరుగుతున్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. శనివారం ఆయన నిర్మాణ, మరమ్మతు పనులను పరిశీలించి, అంతర్గత రోడ్లు, గ్రీనరీ, 'మీకోసం' హాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులకు సూచనలు చేశారు. సోమవారం నాటికి పనుల్లో స్పష్టమైన పురోగతి ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ పరిశీలనలో డిఆర్ఓ బి. చిన ఓబులేసు, ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.