రేపు పొదిలి ప్రజా వేదికకు కలెక్టర్

మార్కాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పొదిలిలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం తెలిపారు. స్థానిక రథం రోడ్డులోని సాయి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. నాలుగు మండలాల ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్