గోవధ జరగకుండా చూడాలి

బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం మార్కాపురం పోలీస్ స్టేషన్లో ముస్లిం పెద్దలతో పీస్ కమిటీ సమావేశం జరిగింది. సీఐ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, పండుగ రోజున గోవధ జరగకుండా ప్రభుత్వం, న్యాయస్థానాల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ముస్లిం పెద్దలు కూడా నిషేధిత జంతువుల వధకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సామరస్యాన్ని కాపాడుతూ బక్రీద్ను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్