ప్రకాశం జిల్లా తర్లుపాడు పోలీస్ స్టేషన్ ను కనిగిరి డీఎస్పీ శ్రీసాయి ఈశ్వర్ యశ్వంత్ తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను, కేసుల పురోగతిని పరిశీలించి, పెండింగ్ కేసులను తగ్గించాలని, రాత్రి వేళ గస్తీ నిర్వహించాలని, ప్రజలతో మర్యాదగా మెలగాలని ఎస్సై బ్రహ్మనాయుడుకి సూచించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.