మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, పట్టణంలోని సప్లై ఛానల్ కాలువలో చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించారు. చెత్త వేసినందుకు రూ. 5 వేల జరిమానా విధిస్తున్నట్లు ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. మార్కాపురం చెరువుకు సప్లై ఛానల్ గా ఉన్న కాలువలో కొద్దిరోజులుగా ప్రజలు చెత్తాచెదారాలు వేస్తున్నారు. ఈ విషయం కమిషనర్ దృష్టికి రావడంతో, చెత్త వేయకుండా వలలు ఏర్పాటు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని బోర్డు ఏర్పాటు చేశారు.