మార్కాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులకు కీలక సూచనలు చేశారు. రెవెన్యూ సంబంధిత అర్జీలు ఎక్కువగా వస్తున్నందున వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 168 అర్జీలలో 112 రెవెన్యూ, 56 ఇతర సమస్యలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ప్రజల అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన, సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.