మార్కాపురం బీసీ భవన్‌లో కాటమరాజు ఆలయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కనిగిరి, పెద్దారవీడు మండలాల్లో కాటమరాజు స్వామి కొలువై ఉన్నారని, నూతనంగా ఏర్పడిన జిల్లాలో ఆయన చరిత్ర ఉందని తెలిపారు. జిల్లాకు కాటమరాజు జిల్లాగా పేరు పెట్టాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు.