విద్యుత్ స్తంభాన్ని పునరుద్ధరించిన అధికారులు

మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభంపై సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుకు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. లైన్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జలం, నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో స్తంభాన్ని నిలబెట్టి మరమ్మతులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా అధికారులు ఎంత వేగంగా స్పందిస్తున్నారో తెలియజేస్తుంది.

సంబంధిత పోస్ట్