మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో శుక్రవారం రాత్రి ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు బేకరీ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, వాటిని సీజ్ చేశారు. నిబంధనలు పాటించని దుకాణాలపై కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలను ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.