వడదెబ్బకు జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ప్రజలకు సూచనలు జారీ చేశారు. వేసవి వేడి తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్లరసాలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని సూచించారు. తల కప్పుకుని వెళ్లడం, వృద్ధులు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, వేడిలో కఠిన శారీరక శ్రమ చేయకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్