ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ను మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని, బస్సు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని ఆర్టీసీ డిఎంకు ఆదేశించారు. బస్టాండ్ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, తినుబండారాలు అధిక ధరలకు విక్రయించరాదని సూచించారు.