ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. సోమవారం ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్ రాజాబాబుకు అర్జీలను సమర్పించారు. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని అర్జీదారులు విజ్ఞప్తి చేయగా, వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.