జిల్లావ్యాప్తంగా హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే మారిన చట్టాల ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని ఆదివారం ప్రకాశం జిల్లా పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్