ఒంగోలు రైల్వే స్టేషన్ లో శుక్రవారం ఈగల్ టీం ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైళ్ల రాకపోకల సమయంలో ప్రత్యేక డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి రైలును జాగ్రత్తగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేస్తున్నట్లు సీఐ సుధాకర్ రావు తెలిపారు. ఎస్సై మధుసూదన్ రావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.