ప్రకాశం జిల్లాలో ఇంధన సరఫరా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్ రాజాబాబు ఫ్యూయల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇంధన కొరత, అధిక ధరలు, నాణ్యత సమస్యలపై ప్రజలు 1077 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు పనిచేస్తుందని, కేవలం ఇంధన సమస్యలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.