ప్రకాశం జిల్లా కొనకనమిట్ల సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్ విధుల పట్ల అలసత్వం వహించడంతో కలెక్టర్ రాజాబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసి సస్పెండ్ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించకపోవడంతో విద్యార్థులు పడిన ఇబ్బందులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.